Beauty Tips

Dark circles:కంటి కింద నల్లటి వలయాలు… అంజీర్ తో చెక్ పెట్టండి…ఎలానో చూడండి

Dark circles Remove Tips in telugu :కంటి కింద నల్లటి వలయాలను స్త్రీ,పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. దీనికి ఆహారపు అలవాట్లు., నిద్రలేమి, ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వాడటం, గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేయడం, ఒత్తిడి వంటివి అనేక రకాల కారణాలు ఉన్నాయి.

వీటిని నివారించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అంజీర్ ఉపయోగించి కంటి కింద నల్లటి వలయాలను ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. అంజీర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంజీర్ ను మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఒక బౌల్లో ఒక స్పూన్ అంజీర్ పేస్ట్, అర స్పూన్ పెరుగు, అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజూ చేస్తుంటే కంటి కింద నల్లటి వలయాలు క్రమంగా మాయం అవుతాయి

ఒక స్పూన్.అంజీర్ పేస్ట్ లో ఒక స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక స్పూన్ పచ్చిపాలు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని కంటి కింద బాగంలోనే కాకుండా ముఖం మొత్తం పట్టించాలి. పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కింద నల్లటి వలయాలు పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.