Beauty Tips

Lips Care Tips:తేనెలో ఇది కలిపి రాస్తే పగిలిన పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Lips Care Tips In telugu : చలికాలం వచ్చిందంటే చాలు పెదాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చలి కాలంలో ఉండే చలిగాలుల కారణంగా .పెదాలు పగిలిపోవడం, పొడిగా మారి పోవడం జరుగుతుంది. ఈ సమస్యను వదిలేస్తే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. పెదాలు పగలకుండా మృదువుగా ఉండాలి అంటే ఖరీదైన లిప్ బామ్ లు వాడాల్సిన అవసరం లేదు.

మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పెదాలు పగలకుండా చూసుకోవచ్చు. ఒక స్పూన్ తేనెలో అర స్పూన్ పంచదార వేసి బాగా కలపాలి. ఈ .మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఐదు నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనె,పంచదారలో ఉన్న పోషకాలు పెదాలకు పోషణ అందిస్తాయి.

మరో చిట్కా కూడా తెలుసుకుందాం. బాదం నూనెను కాటన్ బాల్ సాయంతో పెదాలపై అద్ది మసాజ్ చేయాలి. ఈ విధంగా నాలుగు రోజులు చేస్తే చాలా మంచి ఫలితం కనపడుతుంది. బాదం నూనెలో ఉండే విటమిన్ E పెదాలకు పోషణ ఇచ్చి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. తీసుకునే ఆహారంలో విటమిన్ సి,E ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఆకుకూరలు సీజన్లో వచ్చే పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.