MoviesTollywood news in telugu

Mahesh Babu:మహేష్ బాబు కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Mahesh babu movies :ఎంత పెద్ద హీరో అయినా కొన్ని సినిమాలు ఆగిపోవడం సహజం. దీనికి రకరకాల కారణాలుంటాయి. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే ఇతడి కెరీర్ లో కొన్ని సినిమాలు ఆగిపోయాయి. రిజెక్ట్ చేసిన సినిమాలు హిట్ అయ్యాయి.

అయితే ప్రకటన చేసి, షూటింగ్ కి వెళ్లకుండా ఆగిపోయిన సినిమాల విషయానికి వస్తే, అర్జున్ మూవీ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం ఎస్ రాజు ఓ మూవీ తలపెట్టారు. దానికి సైన్యం అని పేరు కూడా పెట్టారు. అయితే అప్పటికే పోకిరి మూవీ చేయడం, అది బ్లాక్ బస్టర్ కొట్టడంతో మహేష్ ఇమేజ్ కి సైన్యం సరిపోదని భావించారు. ఇంతలో సైనికుడు మూవీ కూడా ప్లాప్ కావడంతో సైన్యం పక్కకు పోయింది.

తన సినిమాలకు అసోసియేట్ గా చేస్తున్న జాస్తి హేమాంబర్ కు మహేష్ ఛాన్సిచ్చాడు. 2007లో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమా చేయడానికి సిద్దమై, మిర్చి టైటిల్ కూడా పెట్టేసారు. ఖలేజా మూవీ ఆలస్యం కావడంతో హేమాంబర్ కి ఛాన్స్ పోయింది.

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వాళ్ళు వరుడు మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయడానికి 2009లో ప్రకటన చేసారు. ఖలేజా జాప్యం వలన ఇది ముందుకి వెళ్ళలేదు. ఆర్ ఆర్ వెంకట్ నిర్మాతగా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీని సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో చేయడానికి మహేష్, కరీనా కపూర్ కాంబోలో 2010లో ప్రకటించారు. 40కోట్లతో తీస్తున్నట్లు ప్రకటించిన ఈ మూవీ దూకుడు తర్వాత ఆగిపోయింది.

కె రమేష్ బాబు నిర్మాతగా బోయపాటి డైరెక్షన్ లో 2011లో ఓ పవర్ ఫుల్ మూవీ ప్రకటన వచ్చినా, తర్వాత దాని ప్రస్తావన లేదు. మణిరత్నం డైరెక్షన్ లో 2013లో వీరుడు అనే మూవీ ప్రకటించారు. స్వయంగా మణిరత్నం ప్రకటించినప్పటికీ ఎందుకో ఆగిపోయింది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హరే రామ హరే కృష్ణ మూవీ ప్రకటించారు.

ఎం ఎస్ రాజు, హారిక హసీని సంస్థ గానీ నిర్మిస్తుందని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. 2016లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో జన గణ మన మూవీ వస్తుందని భావించారు. ఫాన్స్ కూడా బాగా ఎదురు చూసారు. రకరకాల కారణాల వలన ఆగిపోయింది.

సరిలేరు నీకెవ్వరూ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ తరహా మూవీ చేయాలను కున్నారు. అయితే సెకండాఫ్ మార్చమని చెప్పినా,ఈలోగా సర్కారువారిపాట మూవీ కి కమిట్ అవ్వడంతో అది ఆగిపోయింది.