Healthhealth tips in telugu

Apricot:ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…. ఈ విషయం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Apricot Benefits In Telugu : ఆప్రికాట్ పండుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు డ్రై అయిన తర్వాత కూడా పోషకాలు అలానే ఉంటాయి. ఈ పండ్లు తీయగా మరియు మెత్తగా ఉంటాయి. అప్రికాట్స్ సాధారణంగా నారింజ లేదా పసుపు రంగులో ఉంటూ కొద్దిగా ఎరుపురంగుతో కూడి ఉంటుంది. ఆప్రికాట్ లో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.

ప్రతి రోజు ఒక ఆప్రికాట్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనీమియాతో బాధపడేవారికి ఆప్రికాట్ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా తింటే మంచి ఫలితం కలుగుతుంది. ఆప్రికాట్ లో ఉండే కాపర్ ఐరన్ గా శరీరం శోషించుకుంటుంది. హిమగ్లోబిన్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. దాంతో రక్తహీనత సమస్య నుండి బయట పడతారు.

అప్రికాట్ లో సెల్యులోజ్ కరగని ఫైబర్ మరియు పెక్టిన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో నీటి నిల్వలను బ్యాలెన్స్ చేయటమే కాకుండా మలబద్దక సమస్యను తొలగిస్తుంది. భోజనం చేయటానికి ముందు ఒక అప్రికాట్ తింటే జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అప్రికాట్ లో ఉండే ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ జీర్ణక్రియలో సహాయపడతాయి.

అప్రికాట్ లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే మజిల్ ఫంక్షన్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఆప్రికాట్ లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.

ఆప్రికాట్ లో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యే కాల్షియం, ఇనుము, రాగి, మాంగనీస్, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండుట వలన రెగ్యులర్ గా ఆప్రికాట్ తింటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.