Healthhealth tips in telugu

Cold and Flu:దగ్గు,జలుబు, గొంతు నొప్పి,ఛాతిలో కఫం నిమిషాల్లో మాయం

Cold and Flu Home Remedies In telugu : ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే… చాలా మందికి వఛే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి. అందుకే వాటిని వెంటనే తగ్గించుకొనే మార్గాల గురించి ఆలోచించాలి. దగ్గు,జలుబు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఇవి లేకపోతె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిల్ అవుతాం.
Tulasi health benefits In telugu
గొంతులో తేడాగా ఉన్నా ముక్కులో గడబిడ ఉన్నా చాలా చిరాకుగాను నిసత్తుగాను ఉంటుంది. దగ్గు,జలుబు తగ్గేదాకా ప్రశాంతత ఉండదు. ఇవి శరీరంలో సమస్యలకు కారణం అవుతాయి. దగ్గు,జలుబుతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి.కాబట్టి… దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. దీని కోసం ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి చిన్న అల్లం ముక్కను దంచి వేయాలి. ఆ తర్వాత 4 మిరియాలను చితకొట్టి వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ వాము, 5 తులసి ఆకులు, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, చిటికెడు పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేయాలి. ఒక నిమిషం మరిగించి గ్లాస్ లోకి వడకట్టి తాగాలి.

ఈ విధంగా 3 రోజులు తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. డయబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."