Joint Pains:ఒక్కసారి రాస్తే చాలు మెడనొప్పి,నడుమునొప్పి,మడమ నొప్పి, కీళ్లనొప్పులు జీవితంలో ఉండవు
Joint Pains Home Remedies In Telugu :ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు,కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వచ్చేవి కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో 30 సంవత్సరాల వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి.
మోకాళ్ళ నొప్పులు రావటానికి మారిన జీవనశైలి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం,అధిక బరువు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.ఈరోజు కీళ్లనొప్పులు తగ్గించుకోవడానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. నొప్పులు తగ్గించుకోవడానికి చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు
ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.అలాగే ఎక్కువ రోజులు వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెయిన్ కిల్లర్ తీసుకోకుండా నొప్పి ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
50 ml ఆవనూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు,అరస్పూన్ వాము వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనె రాసి మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.