Healthhealth tips in telugu

Sprouted garlic:మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు…

Sprouted garlic health benefits In Telugu :వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనలో చాలా మంది వెల్లుల్లిని తింటూ ఉంటారు. అయితే వెల్లుల్లి పాయ మొలక వస్తే మాత్రం పారేస్తూ ఉంటాం. వీటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది మొలక వచ్చిన వెల్లుల్లిని పాడేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకుంటే అసలు పాడేయరు.

ఆలా మొలక వచ్చిన వెల్లుల్లిపాయలో మాములు వెల్లుల్లిపాయలో కన్నా ఎక్కువ గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ క్రియాశీలంగా ఉంటాయని నిపుణులు చెప్పుతున్నారు. లేత పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోలిస్తే మొలక వచ్చిన పాయలలో రకరకాల మెటాబోలెట్స్ అధికంగా ఉంటాయి.

సాధారణంగా ఈ మెటాబోలెట్స్ గింజల మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలెట్స్ కాపాడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా అద్భుతంగా పనిచేస్తాయి. మాములు వెల్లుల్లి పాయలు కన్నా మొలక వచ్చిన వెల్లుల్లి గుండెకు మేలు చేస్తాయి. కొలస్ట్రాల్, బిపి ని తగ్గించటంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా ఇలా తీసుకోవటం చాలా మంచిది. కాబట్టి మొలక వచ్చిన వెల్లుల్లిని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."