Healthhealth tips in telugu

Joint Pains:ఉదయాన్నే ఈ గింజలను ఇలా తింటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటి ఆన్ని రకాల నొప్పులు మాయం

fenugreek Joint Pains Tips In telugu : మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ,అముమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకొనే ఆహారం,బోన్ కి అవసరమైన పోషణ లేకపోవటం వలన వస్తాయి.
Joint pains in telugu
అలాగే కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కూడా కీళ్ల నొప్పులు వస్తు ఉన్నాయి. మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. ఆ బాధ భరించటం చాలా కష్టం. ఆ బాధ భరించలేక చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేద నిపుణులు మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కొరకు కొన్ని చిట్కాలను చెప్పుతున్నారు.

మెంతులలో యాంటీ ఇంఫ్లేమేటరీ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. మెంతులలో త్రికోనెల్లా ఫోనమ్-గ్రెకమ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనంలో లినోలెయిక్ ఆమ్లం ప్రధానంగా ఉంటుంది. ఈ సమ్మేళనం కీళ్లనొప్పులు తగ్గించటంలో సహాయపడుతుంది.

అయితే మెంతులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మెంతులను నానబెట్టి తీసుకోవచ్చు. మెంతి నీటిని తయారుచేసుకొని నిమ్మకాయ,తేనే కలుపుకొని త్రాగవచ్చు. మెంతులను వేగించి పొడి చేసుకొని సలాడ్స్ ,దోశ,కూరల్లోనూ,సూప్స్ లోనూ వేసుకోవచ్చు.మెంతులను మొలకలుగా తయారుచేసుకొని కూడా తినవచ్చు. మెంతులను ఏ రూపంలో తీసుకున్న కీళ్లనొప్పులు తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."