Sun Flower Seeds:ఒక స్పూన్ గింజలను తింటే….శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?
Sun Flower seeds Benefits in telugu : సన్ ఫ్లవర్ సీడ్స్ ని తెలుగులో పొద్దు తిరుగుడు విత్తనాలు అని అంటారు. సన్ ఫ్లవర్ సీడ్స్ తో తయారుచేసిన నూనెను మనం రోజు వంటల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. నిజానికి సన్ ఫ్లవర్ సీడ్స్ ని ఆయిల్ రూపంలో కాకూండా విత్తనాలు అంటే గింజల రూపంలో తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని ప్రస్తుతం వీటిని తినటం ఎక్కువైంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే విటమిన్ సి ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకుని గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.
అలాగే విటమిన్ E ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. రోజుకి ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే మన శరీరానికి అవసరమైన విటమిన్ E 90 శాతం అందుతుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఉండే ఫైబర్ కొలస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. దాంతో జీర్ణ సంబంధ సమస్యలు అయినా గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటివి రాకుండా చేస్తుంది.
ఈ గింజలలో ఉండే మెగ్నీషియం ఎముకలు బలంగా ఉండటానికి మరియు ఎముకలు గట్టిపడేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా నరాలు రిలాక్స్ కావటానికి హెల్ప్ చేస్తుంది. నాడీవ్యవస్థను ప్రశాంతపరిచి స్ట్రెస్ ని తగ్గిస్తుంది. దాంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు. కాపర్ ఎముకల జాయింట్లు బాగా పని చేయటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


