Tea in Paper cups:పేపర్ కప్పులతో టీ తాగుతున్నారా…ఈ విషయం తెలిస్తే అసలు తాగరు
Drinking tea in paper cups:సాధారణంగా మనం ఏ పార్టీ కి వెళ్లిన ఏ ఫంక్షన్ కి వెళ్లిన హోటల్ కి వెళ్ళిన బస్టాండ్ కి వెళ్ళిన రైల్వే స్టేషన్ కి వెళ్లిన అక్కడ టీ, కాఫీ తాగడానికి పేపర్ కప్పులను వాడటం చూస్తూ ఉంటాం. అయితే ఇలా పేపర్ కప్పులో కాఫీ టీ తాగితే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పేపర్ కప్పు టీ తాగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది వివరంగా తెలుసుకుందాం. పేపర్ కప్పులను తయారు చేసినప్పుడు తక్కువ పరిమాణంలో ప్లాస్టిక్ ఉపయోగిస్తారు. వేడిగా ఉన్న టీ లేదా కాఫీ ఆ కప్పుల్లో పోసినప్పుడు ఆ కప్పులో ఉన్న ప్లాస్టిక్ కణాలు కరిగి కాఫీ, టీ ద్వారా మన శరీరం లోకి వెళ్లి అనేక సమస్యలు కలగటానికి కారణమవుతుంది.
సమస్యలు తాత్కాలికంగా లేనప్పటికీ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ కప్పులు మెరవడానికి మైనం పూత పూస్తారు వేడి పదార్థాలు అందులో వేసుకుని తాగినప్పుడు ఆ మైనం కలిగి మన శరీరంలో పేరుకుపోతుంది. ఇలా మైనం పేరుకుపోవటం వల్ల కడుపు ఉబ్బరం సంబంధించిన సమస్యలు రావడం పేగు పనితీరు తగ్గటం వంటివి జరుగుతాయి. .
కాబట్టి కాఫీ, టీ పేపర్ కప్పులో తాగకుండా స్టీల్ గ్లాస్ లేదా గాజు గ్లాస్ లలో తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అసలు మర్చిపోకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.