Healthhealth tips in telugu

Chewing gum for weight loss:చూయింగ్‌ గమ్ తో బరువు తగ్గండిలా..!

Chewing gum for weight loss:చూయింగ్‌ గమ్ తో బరువు తగ్గండిలా…. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువుతో బాధపడుతున్న వారు తమ బరువుని తగ్గించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అతి సులువుగా తమ బరువుని తగ్గించుకునేందుకు చూయింగ్ గ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందట. ఎలా అంటే?

ఆక‌లిగా ఉన్నప్పుడు వారు చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆకలి చచ్చిపోవడం వల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా శ‌రీరానికి అందే క్యాల‌రీలు కూడా త‌గ్గుతాయి.

దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. కాకపోతే ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చూయింగ్ గ‌మ్‌ను నమలడం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంద‌న్న విషయం గతంలో నిర్వహించిన పలు పరిశోధనల్లో స్పష్టమైంది.

టెన్ష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడిగా ఉన్న‌ సమయంలో చూయింగ్ గ‌మ్‌ను తింటే వెంట‌నే ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని పరిశోధకులు అంటున్నారు. చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు పెరుగుతుంద‌నీ, ఏకాగ్ర‌తగా ప‌నిచేస్తార‌ని 2004లో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."