BusinessDevotional

IRCTC:తిరుమలకు అప్పటికప్పుడు టికెట్స్‌ బుక్‌ చేసుకొని వెళ్లొచ్చే అవకాశం.. స్పెషల్‌ ప్యాకేజీ..

IRCTC:తిరుమలకు అప్పటికప్పుడు టికెట్స్‌ బుక్‌ చేసుకొని వెళ్లొచ్చే అవకాశం.. స్పెషల్‌ ప్యాకేజీ.. తిరుపతి వెళ్ళాలంటే దాదాపుగా నెల రోజుల ముందుగానె బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్నాక కుదరకపోతే అన్ని వృదా అయిపోతాయి.

తిరుమలకు అనుకున్న వెంటనే అప్పటికప్పుడు వెళ్ళాలంటే… ఐఆర్‌సీటీసీ ఒక మంచి టూర్‌ ప్యాకేజీని గోవిందమ్‌ పేరుతొ తీసుకువచ్చింది. ఈ టూర్ ఎలా సాగుతుంది.. ప్యాకేజి ధర ఎంత.. అనే విషయాలను తెలుసుకుందాం.

మొదటి రోజు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి 12734 నెంబర్‌ ట్రైన్‌ బయలు దేరి సికింద్రాబాద్‌, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుతుంది.

తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి హోటల్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసాక దర్సనంకు తీసుకువేళ్ళతారు. ఉదయం 9 గంటల తర్వాత దర్శనంనకు తీసుకువెళ్ళి లంచ్ కూడా తిరుమలలోనే ఉంటుంది.

ఆ తర్వాత తిరుపతి చేరుకొని అక్కడ పద్మావతి అమ్మవారి దర్శనం, అలివేలు మంగమ్మ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ఎక్కాలి. మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లికి చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ఈ ప్యాకేజి టూర్ కి సంబందించిన టికెట్లు జూలై 10వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజి ధర విషయానికి వస్తే.. స్లీపర్ టికెట్స్ రూ.3800, ఏసీ టికెట్ ధరలు 5660 నుంచి ప్రారంభం కానున్నాయి. మరిన్ని పూర్తి వివరాల కోసం IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."