Kitchenvantalu

Karivepaku Rice:చాలా తక్కువ టైం లో లంచ్ బాక్స్ రెడీ చెయ్యాలంటే ఇలా కరివేపాకు రైస్ చేసుకోండి

Karivepaku Rice:కరివేపాకు అన్నం.. కళ్లకు మంచిదని తెల్సినా,కర్రీలో కరివేపాకు కనిపిస్తే,కావాలని పక్కనపెట్టేస్తారు.ముఖ్యంగా పిల్లలు.వారి ఫుడ్ లో కరివేపాకు యాడ్ చేయడం,చాలా అవసరం.అందుకే వారి లంచ్ బాక్స్ లోకి,ఆరోగ్య కరమైన కరివేపాకు రైస్ చేయండి.

కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం -250 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
పచ్చిశనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1/2టీ స్పూన్
మిరియాలు – 1/2టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
ఎండుమిరపకాయలు – 4
చింతపండు – కొద్దిగా
నువ్వులు – 1 టీ స్పూన్
కరివేపాకు – గుప్పెడు
ఆవాలు – 1 టీ స్పూన్
పల్లీలు – 1 1/2టీ స్పూన్
జీడిపప్పులు – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా వండిన అన్నం ను తీసుకుని, ఒక ప్లేట్ లో చల్లార్చు కోవాలి.
2. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని,అందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మిరియాలు,ఎండు మిరపకాయలు, ధనియాలు,
వేసుకుని, లో ఫ్లేమ్ లో వేయించుకోండి.
3. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కొన్ని నువ్వులు , గుప్పెడు కరివేపాకు వేసి,మాడిపోకుండా వేయించుకోవాలి.
4. స్టవ్ హాఫ్ చేసుకుని, చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత,ఆవాలు, శనగపప్పు, మినపప్పు,జీలకర్ర, పల్లీలు, వేసుకుని, చిటపటలాడేవరకు వేయించుకోవాలి.
6. అందులోకి ఎండుమిరపకాయలు తుంచి వేసుకుని, జీడిపప్పులు వేసుకోవాలి.
7. అందులోకి ఒక రెమ్మ వేసుకుని, అన్ని బాగా వేగాక, స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకుని, తీసి పెట్టుకున్న రైస్ అందులో వేసుకోవాలి.
8. ఇప్పుడు ఆ రైస్ లోకి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసుకుని ,తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపుకోవాలి.అంతే వేడి వేడి కరివేపాకు అన్నం రెడీ.