Delayed In Marriages: వివాహం ఆలస్యం అవుతుందా? 8 మంగళవారాలు ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది
Delayed In Marriages:వివాహం ఆలస్యం అవుతుందా? 8 మంగళవారాలు ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది.. వివాహం అనేది సరైన సమయంలో జరిగితేనే జీవితం బాగుంటుంది.
ప్రతి మనిషి జీవితంలోను వివాహం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి అనేది సరైన సమయంలో జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పెద్దవారు కూడా పిల్లలకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని…అలాగే పిల్లలకు కొత్త జీవితం ఏర్పడుతుందని ఆనందపడతారు. అలాంటి పెళ్లి సరైన సమయంలో జరగకపోతే చాలా బాధ పడతారు.
పెళ్లి సరైన సమయంలో జరగకపోవటానికి ప్రతి ఒక్కరికి ఒకే కారణం ఉండదు. మనిషి మనిషికి ఈ కారణాలు మారుతూ ఉంటాయి. అన్ని సదుపాయాలు ఉన్నా ఒక్కోసారి ఎదో కారణం చేత పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి వారు ఆంజనేయస్వామికి ఆలయంలో 108 తమలపాకులతో 8 మంగళవారాలు పూజ చేయిస్తే త్వరగా పెళ్లి కుదురుతుంది.
ఒకవేళ శని దోషం కారణంగా వివాహం ఆలశ్యం అయితే, తమలపాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా పెడితే దోషం నివారణ అయ్యి వివాహం తొందరగా జరుగుతుంది. అంతేకాక ఈ క్రింది మంత్రాన్ని ప్రతీరోజు 108 సార్లు పారాయణం చేసినా వివాహం జరుగుతుంది.
“దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిని సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ”