Hair Fall Tips:జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టిస్తే జుట్టు రాలకుండా విపరీతంగా పెరుగుతుంది
Hair Fall Tips:జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టిస్తే జుట్టు రాలకుండా విపరీతంగా పెరుగుతుంది.. జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా ఒత్తుగా పెరగటానికి మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి చాలా విసిగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద ఉంటే చాలు ఈ సమస్యల నుండి బయట పడవచ్చు.
దీని కోసం కలబందను తీసుకొని సైడ్స్ లో ఉండే బాగాన్ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఈ ముక్కలు ఒక కప్పు ఉండేలా చూసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ టీ పొడి వేసి అవసరమైన నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని హెయిర్ స్కాల్ప్ దగ్గర బాగా అప్లై చేయాలి. ఈ స్కాల్ప్ దగ్గరే మనకు ఎక్కువగా జుట్టు రాలటం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడ ఎక్కువగా అప్లై చేస్తే ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు రావడం ప్రారంభం అవుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం తప్పనిసరిగా వస్తుంది. జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా జుట్టు కాంతివంతంగా మెరిసేలా ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK