MoviesTollywood news in telugu

Thammudu Movie:పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Thammudu Movie:పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. తొలిప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఏమిటి అనే దానిపై సందిగ్దత నెలకొంది. అప్పటికే మెగాస్టార్ తమ్ముడిగా క్రేజ్ నెలకొంది.

అందుకే పవన్ కి తగ్గ కథలు రాయడంలో రైటర్స్ పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ రేంజ్ కి తగ్గట్టు ఉండాలి. సరిగ్గా అదే సమయంలో తమ్ముడు మూవీ వచ్చింది. మెగాస్టార్ తమ్ముడు కూడా కావడంతో ఈ టైటిల్ ఫాన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే కొత్తగా అరుణ్ ప్రసాద్ కి డైరెక్షన్ ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి.

కొత్తవారికిస్తే తమ్ముడు మూవీ దెబ్బతినడం ఖాయమన్న నెగెటివ్ టాక్ కొన్నాళ్ళు నడిచింది. 1979బ్రేకింగ్ ఎవే అనే ఆంగ్ల చిత్రం సూపర్ హిట్ అయింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమీర్ ఖాన్ తో 1992లో జో జీతా వహి సికిందర్ అనే మూవీ తీశారు.

అది కూడా ఘనవిజయం సాధించడంతో అందులోని కీ పాయింట్ పవన్ కి కరెక్ట్ గా సూటవుతుందని భావించి, ఆడియన్స్ అభిరుచి ,ఫాన్స్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, సైకిలింగ్ అంతగా సూటవ్వదని, మార్షల్ ఆర్ట్స్ తెల్సిన పవన్ పై అదే మెయిన్ గా పెట్టి, కింగ్ బాక్సింగ్ ని మెయిన్ గా చూపిస్తూ, తమ్ముడు మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేసాడు.

బలమైన సెంటిమెంట్ తో పాటు,కామెడీ కూడా ఎక్కడా మిస్సవ్వకుండా కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. సంభాషణ లను చింతపల్లి రవి రాసాడు. ఓ క్యాంటీన్ ఓనర్ కి ఇద్దరు కొడుకులు పెద్దోడు కింగ్ బాక్సింగ్ లో ఛాంపియన్ అవ్వాలని చూస్తే, చిన్నోడు కాలేజీలో ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటాడు.

తండ్రి చేత తిట్లు తింటూ ఉంటాడు.అయితే ప్రత్యర్థుల కుట్రలో అన్నయ్య గాయాలపాలైతే తండ్రి ఆశయం తీర్చడానికి బాక్సింగ్ లోకి దిగడం ద్వారా తమ్ముడు బాధ్యతను భుజాన వేసుకుంటాడు.
pawan kalyan
ఫ్యామిలీ ఆశయం నెరవేర్చి శభాష్ తమ్ముడు అనిపించుకుంటాడు. తొలిభాగం డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకుంటూ సరదాగా గడిపేయడం,ఆసందర్బంగా కామెడీ పండించాడు. సెకండాఫ్ లో బాధ్యత గల తమ్ముడి పాత్రలో కష్టపడడం కూడా కుదిరింది. డైలాగ్ డెలివరీలో తనకంటూ ఓ మార్క్ ఉంది. అదే తమ్ముడి మూవీలో హెల్ప్ గా నిల్చింది.

కిక్ బాక్సింగ్ లో పవన్ రెచ్చిపోవడం,రమణ గోగుల బ్లాక్ బస్టర్ ట్యూన్స్ వెరసి సినిమా సక్సెస్. రెండు దశాబ్దాలు పూర్తయినా సరే,ఈ సినిమా ఇప్పటికీ ఫాన్స్ కి ఇష్టమైన మూవీ. ఇక సినిమా ఇక్కడ హిట్ అయ్యాక బద్రి పేరిట విజయ్ తమిళంలో,యువరాజు గా కన్నడలో రీమేక్ అవ్వడంతో అక్కడా హిట్ అయ్యింది.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK