Pradakshina:ప్రదక్షిణ ఎందుకు చేస్తామో తెలుసా.. ప్రదక్షిణ వల్ల లాభమేంటి.. ఎన్నిసార్లు చేయాలి
Pradakshina:ప్రదక్షిణ ఎందుకు చేస్తామో తెలుసా.. ప్రదక్షిణ వల్ల లాభమేంటి.. ఎన్నిసార్లు చేయాలి.. దేవుని దర్శనం కొరకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేయటం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ప్రదక్షిణను రెండు రకాలుగా చేస్తూ ఉంటారు.
ఒకటి ఆత్మ ప్రదక్షిణ, ఇంకొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం.అసలు ప్రదక్షిణ చేయటం వెనక ఉన్న పరమార్థం చాలా మందికి తెలియదు. సృష్టికి మూలమైన భూమి తన చుట్టూ తాను తిరగడమే కాదు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది.
భూ భ్రమణ, పరిభ్రమణాల వల్ల దానికి శక్తి లభించిందా. ఉన్న శక్తిని నిలబెట్టుకోవటానికి ప్రదక్షిణలు చేస్తుందో అనే దాన్ని పక్కన పెడిత భ్రమణం ఆగిపోయిన మరుక్షణం ఏదైనా జరగవచ్చు. సృష్టే నిలిచిపోవచ్చుసూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తి లభిస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టేఆత్మ ప్రదక్షిణ, విగ్రహం చుట్టూ తిరగడంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది.
ఈ ప్రదక్షిణ వలన మనిషి ఙ్ఞానానికి అతీతమైన శక్తిని పొందటమే కాకుండా శరీరానికి,మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది. ఆది శంకరాచార్యుల ప్రకారం…నిజమైన ప్రదక్షిణ ధ్యానం లాంటిది. ప్రదక్షిణలు ఎన్ని చేయాలో దాని మీద ఖచ్చితమైన నియమం ఏమి లేదు.అయితే బేసి సంఖ్యలో 3,5,7,9,11 ఇలా ప్రదిక్షణలు చేస్తూ ఉంటారు.
స్కంద పురాణం ప్రకారం ప్రదక్షిణాలు చేస్తూ చేసిన పాపాలు తొలగిపోతాయని ఉంది. అందువల్ల ఏ గుడికి వెళ్లిన తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.