Yamadonga Child artist: ‘యమదొంగ’ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే..
Yamadonga Child artist: ‘యమదొంగ’ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే.. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంతో మంది పెద్దయ్యాక హీరో హీరోయిన్స్ గా రాణిస్తున్నవాళ్ళు, వివిధ వివిధ విభాగాల్లో సినిమా పరిశ్రమలోనే రాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరైతే ఇండస్ట్రీకి దూరంగా వేరే వ్యాపారాల్లో,ఉద్యోగాల్లో ఉన్నారు. ఇంద్ర మూవీలో చిన్ననాటి చిరు పాత్రలో నటించిన తేజ కూడా ఇటీవల ఓ బేబీ సినిమా తో కంటిన్యూ హీరో అయ్యాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ వంటివాళ్ళు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యమదొంగ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు శ్రీ సింహ. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ తో కలిసి ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేసిన యితడు ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి పుత్రుడే. యమదొంగ ముందు విక్రమార్కుడు సినిమా లో కూడా హీరో హీరోయిన్ కోసం వెళ్లిన ఇంట్లో కనిపించే పిల్లల్లో ఒక అబ్బాయిగా చేశాడు.
మర్యాద రామన్న సినిమా లో కూడా రాయలసీమలో హీరో సునీల్ కి దారి చూపించే ఓబులేసు క్యారెక్టర్ చేసి, ఆ తర్వాత మత్తు వదలరా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది చివర్లో విడుదలైన ఈ మూవీ ప్రయోగాత్మక చిత్రంగా నిల్చింది. శ్రీ సింహ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇదే సినిమాలో ఇతడి సోదరుడు కాలభైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఓ సాంగ్ పాడాడు.
అయితే ఇతడికి కేవలం నటనలో మాత్రమే కాదు, సినిమాకు సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్లలో కూడా ప్రావీణ్యం ఉంది. బాహుబలి సినిమా కి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశాడు. 2018 లో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం రంగస్థలం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అయితే సుకుమార్ దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు తను కీరవాణి గారి కొడుకు అని చెప్పలేదట. ఈ విషయాన్ని మత్తు వదలరా సినిమా సమయంలో జరిగిన ఒక ఈవెంట్ లో స్వయంగా సుకుమారే చెప్పడం విశేషం.