Devotional

Sravana Masam 2024:శ్రావణ మాసంలో ఆడవాళ్లు తలలో ఈ పువ్వు పెట్టుకొని ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది

Sravana Masam 2024:శ్రావణ మాసంలో ఆడవాళ్లు తలలో ఈ పువ్వు పెట్టుకొని ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొంది లక్ష్మి కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలని పండితులు అంటున్నారు. లక్ష్మి కటాక్షం కలగాలంటే ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు. మహిళలకు కూడా పండుగ రోజు. శుక్రవారం మహిళలు అమ్మావారిని దర్శించుకోవటం వలన సకల సంపదలు పొందుతారు. అలాగే శుక్రవారం లక్ష్మి దేవి గుడికి లేదా అమ్మవారి గుడికి వెళ్ళితే కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు. శుక్రవారం అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం నైవేద్యం పెడితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

శుక్రవారం ఉదయమే తలస్నానము చేసి ఎరుపు లేదా తెలుపు లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించి ఇంటిలో పూజ చేసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని నేతితో దీపం వెలిగించాలి. ఇలా వెలిగించటం వలన సుమంగళి గా ఉండటమే కాకుండా అనుకున్న పనులు ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగిపోతాయి.

శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులను సమర్పించటం వలన ఇంటిలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. శుక్రవారం పరమాన్నం తింటే మంచిది. అలాగే మహిళలు తెల్లని పువ్వుల్ని తలలో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. శుక్రవారం పూజ చేయటం వలన అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా ఏమైనా కష్టాలు ఉంటె తొలగిపోతాయి.

దేవాలయానికి వెళ్లే ముందు సాంప్రదాయ దుస్తులను ధరించి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దేవాలయంలో ఇచ్చిన కుంకుమ లేదా విభూతిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే దేవాలయాలలో కర్పూరం వెలిగించినప్పుడు అక్కడ ఉండే దీపాలతో వెలిగించకూడదు. అలాగే ఇతరులను అగ్గిపెట్టె అడగకూడదు. ఆలా చేస్తే పుణ్య ఫలం రాకుండా పోతుంది.

శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్లి గరికె మాలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు విఘ్నలను తొలగించే వినాయకుడు ఏ ఆటంకాలు లేకుండా చేస్తారు.

శుక్రవారం శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను తీసుకువెళ్లి శివునికి సమర్పిస్తే కష్టాలు తొలగిపోయి ఇంటిలో సుఖ శాంతులు నెలకొంటాయి.

శుక్రవారం విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలను సమర్పించాలి. కోరిన కోరికలు నెరవేరతాయి.

ఆంజనేయ స్వామి గుడికి వెళ్లేవారు స్వామికి వెన్నముద్దను సమర్పిస్తే వ్యాపారంలో అభివృద్ధి చెంది ధనాన్ని బాగా సంపాదిస్తారు.

దుర్గాదేవిని దర్శించుకునే మహిళలు పసుపు,ఎరుపు,తెలుపు రంగు పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే బాధలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషలతో ఉండటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK