Healthhealth tips in telugu

Amla With Honey:పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే..

Amla With Honey:పరగడుపున తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే.. ఉసిరి కాయల్లో, తేనెలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిలోను యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు సమృద్దిగా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
usiri benefits in telugu
తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల ఇది లివర్‌ను హెల్తీగా ఉంచడంతో పాటు జాండిస్‌ను నివారిస్తుంది. శరీరంలో మరియు కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ మరియు టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది.
Honey benefits in telugu
తేనెలో నంబెట్టిన ఉసిరికాయ అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతే కాదు ఇది ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుండి మరియు పైల్స్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ముఖ్యంగా చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి.

శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనపడుతుంది. ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెను పోసి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి.
usiri and honey
ఆ తర్వాత మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా విరివిగానే లభిస్తున్నాయి. కాబట్టి తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను తిని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK