Beauty Tips

Hair Care Tips:జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లటం కూడా తగ్గుతుంది

Hair Care Tips:జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లటం కూడా తగ్గుతుంది.. ఈ రోజుల్లో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో పాటు జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను తొలగించటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జుట్టు సమస్యలకు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
Hair Fall Tips In Telugu
అరకప్పు పచ్చి కొబ్బరిని,ఒక కప్పు నీటిని పోసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి వడకట్టి పాలను తయారుచేసుకోవాలి. ఆ తర్వాత బాగా పండిన అరటిపండును ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మిక్సీ చేయాలి. కొబ్బరి పాలల్లో మిక్సీ చేసిన అరటి పండు పేస్ట్ ని వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పావుగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అరటి పండు,కొబ్బరి పాలల్లో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK