Beauty Tips

Curd For Face:ముఖం మీద జిడ్డు,దుమ్ము,ధూళి తొలగిపోయి లోతుగా శుభ్రం చేస్తుంది

Curd For Face:ముఖం మీద జిడ్డు,దుమ్ము,ధూళి తొలగిపోయి లోతుగా శుభ్రం చేస్తుంది.. చర్మ తత్వం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది చర్మం పొడిగా ఉంటే మరి కొందరి చర్మం అయిలీగా ఉంటుంది. ఆయిల్ చర్మం ఉన్నవారికి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మంపై జిడ్డు ఎక్కువగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
Pimples,Beauty
మొటిమలు, మచ్చలు వంటివి వచ్చాయంటే అంటే ఒక పట్టాన తగ్గవు ముఖాన్ని శుభ్రం చేసుకున్న కొంచెం సేపటికే ముఖం జిడ్డుగా మారిపోయి ఉంటుంది. జిడ్డు చర్మం వారికి ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని కోసం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఏమి వాడాల్సిన అవసరం లేదు.

మన ఇంటిలో ముఖ్యంగా వంటింట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖం మీద జిడ్డు మురికి దుమ్ము ధూళి వంటి వాటిని సమర్థవంతంగా వదిలించుకోవచ్చు.ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యం వేసి నీటిని పోసి .నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.మిక్సి జార్ లో నానిన బియ్యం టమాటా ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ నుంచి జ్యూస్ ను సపరేట్ చేయాలి. పల్చని వస్త్రంలో ఒక స్పూను పెరుగు వేసి అందులో నీటిని తొలగించాలి. ఒక బౌల్ లో నీటిని తొలగించిన పెరుగు, బియ్యం టమాటా రసం రెండు స్పూన్లు,అరచెక్క నిమ్మరసం, రెండు స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద అదనంగా ఉన్న జిడ్డు తొలగిపోవడమే కాకుండా చర్మం శుభ్రపడి కాంతివంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇలా ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.