Varalakshmi Vratham:వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరిస్తే అమ్మవారి కృప కలుగుతుందో..
Varalakshmi Vratham:వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరిస్తే అమ్మవారి కృప కలుగుతుందో.. మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవాతం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. మహిళలు సంతానం,అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఈ వ్రతాన్ని చేస్తారు.
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైనా ఆటంకం కారణంగా వరలక్ష్మి వ్రతం చేయటం కుదరకపోతే శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరిస్తే అమ్మవారి కృప కలుగుతుందో తెలుసుకుందాం. కైలాసంలో శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతి దేవి వచ్చి శివుణ్ణి దేవా లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడిగెను. అప్పుడు శివుడు దేవి స్త్రీలకు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ ఇచ్చే వ్రతం ఒకటి ఉంది.
ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతంను శ్రావణ మాసంలో శుక్ల పక్ష పొర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని చెప్పగా, అప్పుడు పార్వతి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా సెహెప్పంని అడిగెను. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పెను. పతియే ప్రత్యక్ష దైవం అనే భావించే చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతి దేవుణ్ణి పూలతో పూజించి,ఆ తర్వాత అత్తమామలకు సేవలు చేసేది.
ఇంటి పనులను ఓర్పు,నేర్పుతో చేస్తూ ఎవరితోనూ మాట అనిపించుకోకుండా గొడవలు పడకుండా ఉండేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న చారుమతి మీద లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీదేవి వచ్చి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన నన్ను పూజిస్తే కోరిన వరాలను ఇస్తానని చెప్పెను. వెంటనే చారుమతి ఆ కలను భర్త,అత్తమామలకు,ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది.
చారుమతి,ఇరుగు పొరుగు స్త్రీలు అందరూ వరలక్ష్మి వారాంతం చేసి మూడు ప్రదక్షిణాలు చేసేటప్పటికి వారి ఇల్లులు అన్ని స్వర్ణమయం అయ్యాయి. ఇక అప్పటి నుండి చారుమతి మరియు ఆ స్త్రీలందరు ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతం చేస్తూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ కథను విన్నా, ఈ వ్రతం అందరితోనూ చేయించిన సకల సౌఖ్యాలు కలుగునని పార్వతితో శివుడు చెప్పెను.
ఇంత మహత్తు కలిగిన వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో తెలుస్కుందాం. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని,గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. లక్ష్మి దేవిని ఈశాన్యం దిక్కున పెట్టి పూజ చేస్తే మంచిది. అందువల్ల ఈశాన్యంలో పద్మం ముగ్గు పెట్టి పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి.
వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువులు
పూజ చేసే స్థలంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టాలి. ఒక పళ్లెంలో బియ్యాన్ని పోసి దాని మీద తమలపాకులు వేసి కలశాన్ని పెట్టాలి . కలశంలో మామిడి ఆకులను ఉంచాలి. బియ్యం పోయాలి. పసుపు,గంధంలతో అలంకరణ చేయాలి. దానిపై కొత్త కొబ్బరికాయను పెట్టి దానిపైన కొత్త జాకెట్ ముక్కను పెట్టాలి. ఈ కలశాన్ని మన అభిరుచి మేరకు అలంకరణ చేయవచ్చు.
దీపారాధన, పసుపు,కుంకుమ,అగరవత్తులు,కొబ్బరికాయలు,కర్పూరం,అరటి పండ్లు,తమలపాకులు,ఏడు రకాల పువ్వులు,ఏడు రకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి.తొమ్మిది పోగులతో తోరం కట్టి పూజలో పెట్టాలి. వరలక్ష్మి పూజలో తోరం పూజ అతి ముఖ్యమైనది. తోరంను ఇలా తయారుచేయాలి. తొమ్మిది పోగుల దారాన్ని తీసుకోని పసుపు రాసి తొమ్మిది ముళ్ళు వేస్తూ ఒకో ముడిలో పూవులను పెట్టాలి.
ఆ తర్వాత వినాయకుణ్ణి పసుపుతో తయారుచేసుకోవాలి . వినాయకుణ్ణి కలశం దగ్గర పెట్టి దీపారాధన చేసి ఆచమనం చేయాలి. ఆ తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత తమ గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చెప్పకోవాలి. ఆ తర్వాత నీటిని ముట్టుకొని వినాయకునికి షోడశ ఉపచార పూజ చేయాలి. పువ్వులు,అక్షింతలు వేసి ఓం గణపతాయా నమః అని మంత్రమ్ చదివి దూపం ఇవ్వాలి. దీపానికి నమస్కరం చేసి వినాయకునికి బెల్లం ముక్క,అరటిపండు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పించి మంగళ హారతి ఇవ్వాలి.
ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారికి కుంకుమ పెట్టి తొమ్మిది పోగులతో తయారుచేసుకున్న తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టాలి. పువ్వులు,అక్షింతలను పట్టుకొని లక్ష్మి అష్టకం చదివి పువ్వులు,అక్షింతలను అమ్మవారి మీద వేయాలి. ఇప్పుడు పువ్వులు,అక్షింతలను పూజ చేస్తూ లక్ష్మి అస్తోత్తర నామాలు,కనకధారా స్త్రోత్రం భక్తితో చదవాలి.
ఇప్పుడు తోరం మీద పసుపు,కుంకుమ,పువ్వులు,అక్షింతలను తీసుకోని తొమ్మిది సార్లు పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారి ఫోటో మీద,కలశం మీద,అమ్మవారి రూపు మీద పంచామృతం జల్లాలి. ఆ తర్వాత శుద్ధోదకం జల్లాలి. ఆ తర్వాత అమ్మవారికి అప్సుపు,కుంకుమ,పువ్వులు,అక్షింతలు సమర్పించి దూపం దీపం పెట్టాలి. ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న తోరాలలో ఒకటి అమ్మవారికి ఉంచి మరొకటి మనం కట్టుకోవాలి. మిగిలినవి ముత్తైదువులకు పంచిపెట్టాలి. కొన్ని అక్షింతలను తీసుకోని అమ్మవారి మీద కొన్ని జల్లి మిగిలినవి మన మీద జల్లుకోవాలి. ఆ తరవాత
ఓం శ్రీ వరలక్ష్మి ధూపం సమర్పయామి అని అగరత్తులను అమ్మవారికి చూపాలి.
ఓం శ్రీ వరలక్ష్మి నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ వరలక్ష్మి తాంబులం సమర్పయామి అని తాంబులం సమర్పించాలి.
ఓం శ్రీ వరలక్ష్మి నీరాజనం సమర్పయామి అని కర్పూర హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ వరలక్ష్మి మంత్రపుషం సమర్పయామి అని పువ్వులు సమర్పించాలి.
ఓం శ్రీ వరలక్ష్మి ప్రదక్షిణ సమర్పయామి అని ప్రదక్షిణ చేయాలి
ఓం శ్రీ వరలక్ష్మి నమష్కారం సమర్పయామి అని నమస్కారం చేయాలి
పూజ అంతా అయ్యాక ప్రసాదం తీసుకోవాలా. సాయంత్రం ముత్తైదువులను పిలిచి తాంబులం ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం చేసిన రోజు శాఖాహారం తీసుకోవాలి. పూజ ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితిలోను ఉద్వాసన చెప్పకూడదు. ఇలా చేస్తే ఇంటిలో నుంచి లక్ష్మి దేవిని పంపినట్టే అవుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండాలనే నియమం లేదు. అయితే పూజ ముగిసే వరకు ఏమి తినకూడదు. పూజ ముగిసిన తర్వాత విస్తరాకులో భోజనం చేయాలి. భర్త,అష్ట ఐశ్వర్యాలు,ఆయుర్ ఆరోగ్యాలు జీవించినంత కాలం తమతో ఉండాలని లక్ష్మీదేవిని కోరుకోవాలి.