Devotional

Raksha Bandhan 2024:ఆగస్టు 19 రాఖీ పండుగ.. ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలుసుకోండి

Raksha Bandhan 2024:శ్రావణ పౌర్ణమి 2024 ఆగస్టు 19న సోమవారం రావటం వలన రాఖీ పండుగను ఆగస్టు 19న జరుపుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశి వారికి ఎలాంటి రంగు రాఖీ కట్టాలో తెలుసుకుందాం.

మేష రాశి: ఎరుపు రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో కుజుడు బలపడతాడు.
వృషభ రాశి: తెల్లటి రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో శుక్రుడు బలపడతాడు.
మిధున రాశి: ఆకుపచ్చ రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
కర్కాటక రాశి:తెల్లటి రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో చంద్రుడు బలపడతాడు.
సింహ రాశి: పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో సూర్యుడు బలపడతాడు.
కన్య రాశి: పచ్చ రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
తులా రాశి: తెల్లటి రంగు రాఖీని కడితే సోదరుని జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడతారు.
వృశ్చిక రాశి: ఎరుపు రంగు రాఖీని కడితే సోదరుని జాతకంలో కుజుడు బలపడతాడు.
ధనుస్సు రాశి:పసుపు రంగు రాఖీని కడితే సోదరుని జాతకంలో కుజుడు బలపడతాడు.
మకర రాశి: నీలం రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి.
కుంభ రాశి: ఆకాశ నీలి రంగు రాఖీ కడితే సోదరుని జాతకంలో శని బలపడుతుంది.
మీనరాశి: పసుపు రాఖీ కడితే సోదరుని జాతకంలో కుజుడు బలపడతాడు.