MoviesTollywood news in telugu

Tollywood:ఈ హీరోని గుర్తు పట్టారా… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా…

Tollywood:ఈ హీరోని గుర్తు పట్టారా… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా… టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు వస్తున్నారు. వారిలో కొంత మంది కెరీర్ కొంత కాలానికి ఆగిపోతుంది. మరి కొంత మంది హీరోలు చాలా సక్సెస్ గా ముందుకు సాగుతున్నారు. తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించినటువంటి “ఆనందం” అనే చిత్రంలో హీరోగా ఉన్నటువంటి పాత్రలో నటించిన హీరో వెంకట్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటాడు.

అయితే తెలుగులో దాదాపుగా 15కు పైగా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.కానీ కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడం మరియు ఈయన నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు.అయితే ఇటీవల కాలంలో వెంకట్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అప్పట్లో మీకు ఓ స్టార్ హీరో అవకాశాలు రాకుండా చేసాడంట కదా అని అడిగాడు. దీంతో వెంకట్ సమాధానం చెబుతూ సినీ పరిశ్రమలో ఎవరినీ ఎవరూ తొక్కేయడం, అవకాశాలు రాకుండా చేయడం వంటివి ఉండవని మన టాలెంట్ మరియు హార్డ్ వర్క్ మాత్రమే మనల్ని సినిమా పరిశ్రమలో ఉన్నత స్థాయిలో నిలబెడతాయని, ఈ విషయాన్ని బాగా నమ్ముతానని తెలిపాడు.

అంతేగాక తాను నటించినటువంటి చిత్రాల్లో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆడలేదని అందువల్లనే తాను హీరో గా రాణించలేక పోయానని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాల్లో పెద్దగా రాణించలేక పోయినటువంటి వెంకట్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.అంతేగాక ఆ మధ్యకాలంలో ప్రముఖ సోలార్ సంస్థతో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకున్నట్లు గతంలో పలు సందర్భాల్లో తెలిపాడు.

అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, జగపతిబాబు, నందమూరి బాలకృష్ణ తదితర హీరోలతో కలిసి వెంకట్ నటించాడు.కానీ వెంకట్ హీరోగా నటించినటువంటి “ఆనందం” చిత్రం ఇప్పటికీ చాలామందికి తమ ఫేవరెట్ చిత్రాల లిస్టులో ఉంటుంది.