DevotionalToday Rasi Phalalu In telugu

Telugu Rasi Phalalu:August 19 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పనుల్లో ఇబ్బందులు..

Telugu Rasi Phalalu:August 19 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పనుల్లో ఇబ్బందులు..ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మేవారు ఎక్కువగా కనపడుతున్నారు. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ వాటికీ అనుగుణంగా పనులను కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వారు ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటూ ముందుకు సాగుతారు.

మేషరాశి
ఈ రాశి వారికీ ప్రారంభించే పనిలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవరితోనూ ఎక్కువగా చనువుగా ఉండకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి. ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలి.

వృషభ రాశి
ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

మిధున రాశి
బుద్ధి బలంతో మీ కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.డబ్భుకు లోటు ఉండదు.

కర్కాటక రాశి
ఈ రాశి వారు ఏ పని చేసిన ప్రయత్న లోపం లేకుండా చేయాలి. నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి.గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

సింహరాశి
ఈ రాశి వారు ఏ పని చేసినా బుద్ధి బలంతో చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఏ పని చేసిన బాగా అలోచించి చేస్తారు.

కన్య రాశి
ఈ రాశి వారికి చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కాస్త ఆలోచించి అడుగు వేయాలి. కుటుంబ సభ్యుల మద్దతు బాగుంటుంది.

తులారాశి
ప్రారంభించిన పనులను చాలా తొందరగా పూర్తి చేస్తారు. ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవాలి. విజయం వీరి వెంట ఉంటుంది.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి కొన్ని సంఘటనలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి
ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కుంభరాశి
ఈ రాశి వారు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అలసట కాస్త ఎక్కువగానే ఉంటుంది. తోటి వారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.