Homemade Herbal shampoo:ఈ షాంపూతో తల రుద్దితే జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా పొడవుగా పెరుగుతుంది
Homemade Herbal shampoo:ఈ షాంపూతో తల రుద్దితే జుట్టు రాలకుండా,చుండ్రు లేకుండా పొడవుగా పెరుగుతుంది.. ఒకప్పుడు తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలు,శీకాయలు వాడేవారు. కానీ ఇప్పుడు మనలో చాలా మంది షాంపూలు వాడుతున్నారు. షాంపూ ఎక్కువగా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజు మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా షాంపూ తయారుచేసుకుందాం.
దీనికి కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక స్పూన్ మెంతులను నీటిని పోసి ఆరు గంటలు నానబెట్టాలి. పది కుంకుడు కాయలను తీసుకొని వాటిలోని గింజలు తీసేసి నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఒక మిక్సీ జార్ లో నానిన మెంతులు,నానిన కుంకుడు కాయలు, నాలుగు మందార ఆకులను వేసి మిక్సీ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి తల రుద్దుకోవాలి. ఈ షాంపూని ఫ్రిజ్ లో పెడితే పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేసి జుట్టుకి పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా,మెరిసేలా చేస్తుంది. అలాగే కుంకుడు కాయలో ఉండే విటమిన్ లు జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రం చేయటం వలన చుండ్రు సమస్య ఉండదు. మెంతులు మూలాల నుండి జుట్టును బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. మందార ఆకులో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా చేసి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.