Arundhati Movie:’అరుంధతి’ లో అనుష్క కి డబ్బింగ్ చెప్పిన టాప్ హీరోయిన్..
Arundhati Movie:’అరుంధతి’ లో అనుష్క కి డబ్బింగ్ చెప్పిన టాప్ హీరోయిన్.. ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అరుంధతి పాత్ర వేసిన అనుష్కకి ఎవరు డబ్బింగ్ చెప్పారా అని ఆలోచన రాక మానదు.
ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క హావభావాలకు బాగా సెట్ అయ్యే విధంగా డబ్బింగ్ చెప్పటం కుదిరింది. అనుష్కకు డబ్బింగ్ చెప్పినది బుల్లితెర నటి శిల్ప. ఈమె సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు వేసేది. అలాగే సౌందర్య,ఆమని వంటి ఎంతో మంది హీరోయిన్స్ కూడా డబ్బింగ్ చెప్పింది. శిల్ప మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించేది.
ఆ తరవాత సినిమాలలో పర బాషా నటులకు డబ్బింగ్ చెప్పటం ప్రారంభించింది. సౌందర్య నటించిన ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పింది. సౌందర్య కూడా శిల్ప చేత డబ్బింగ్ చెప్పించమని మరీ చెప్పేవారట. అలాగే అనుష్క ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పేది.
ఒక పాత్ర పండాలంటే ఆర్టిస్ట్ హావభావాలతో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యమే. శిల్ప డబ్బింగ్ అనుష్క పాత్రలకు ప్రాణం పోస్తుందంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి శిల్ప ప్రస్థానం ఎలా ప్రారంభం అయిందంటే…. శిల్ప చదువుకొనే రోజుల్లో తల్లి ప్రోత్సాహంతో టెలివిజన్ సీరియల్స్ లో నటించేది.
ఆ తర్వాత నిదానంగా డబ్బింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో సినిమాలోని సైడ్ పాత్రలకు డబ్బింగ్ చెప్పేది. ఆ తర్వాత అశ్విని నాచప్ప నటించిన అశ్విని సినిమాలో అశ్విని క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంతో….అప్పటి నుంచి హీరోయిన్స్ కి డబ్బింగు చెప్పటం ప్రారంభించి ఇప్పటివరకు తన డబ్బింగ్ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.
శిల్ప బుల్లితెర నటుడు మహర్షి రాఘవను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహర్షి సినిమాతో రాఘవ సినీ రంగానికి వచ్చి సినిమాలు చేస్తూ అడపా దడపా సీరియల్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. వీరికి ఒక కుమారుడు రుద్రాక్ష్..అమెరికాలో బిబిఎ చదువుతున్నాడు. శిల్ప ఇప్పటికి పది నంది అవార్డ్స్ గెలుచుకుంది. ఈమె దాదాపుగా 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది.