MoviesTollywood news in telugu

Anchor Anasuya:జబర్జస్త్ కి రాక ముందు అనసూయ ఏమి చేసేదో..

Anchor Anasuya:జబర్జస్త్ కి రాక ముందు అనసూయ ఏమి చేసేదో.. యాంకర్ అనసూయ గురించి ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు. జబర్జస్త్ చూసే ప్రతి ఒక్కరికి ఆమె తెలుసు. జబర్జస్త్ ముందు ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు.

జబర్జస్త్ అనే ఒక్క షో తో అనసూయ  పెద్ద స్టార్ అయ్యిపోయింది. జబర్జస్త్ కి ముందు అనసూయ ఏమి చేస్తూ ఉండేది. ఆమె అసలు ఏ ఊరిలో పుట్టింది. వంటి విషయాల గురించి తెలుసుకుందాం. విశాఖపట్నంలో పుట్టిన అనసూయ హైదరాబాద్ లో పెరిగింది.

ఆమె హైదరాబాద్ లో MBA పూర్తి చేసి  HR డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేది. ఈ సమయంలో సాక్షి టివి వారు యాంకర్స్ కావాలని యాడ్ ఇచ్చారు. ఈ యాడ్ చూసి అనసూయ ఆడిషన్స్ కి వెళ్ళింది. అక్కడ సెలక్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం చేసింది. సాక్షిలో చేరే వరకు ఆమెకు తెలుగు పెద్దగా రాదనే చెప్పాలి. సాక్షి వల్లే తెలుగు నేర్పించారని అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

సాక్షిలో పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు పెళ్లి అయింది. సుశాంత్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకొని…MAA టివిలో rj గా పనిచేస్తూ….కొన్ని ప్రవైట్ కార్యక్రమాలకు పనిచేస్తూ ఉండేది. ఈ సమయంలోనే ఆమెకు జబర్జస్ట్ నుంచి పిలుపు వచ్చింది.

అంతే ఆమె జాతకం మారిపోయింది. ఆ తర్వాత అనసూయను తీసేసి రష్మీ గౌతమ్ ని పెట్టారని అభిమానులు రచ్చ రచ్చ చేసారు. సినిమాల్లో కూడా అవకాశాలను సంపాదించుకొని…అటు టీవీ…ఇటు సినిమాలు చేస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ.