White Hair Turn Black:కేవలం రెండు రూపాయలతో… తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా…
White Hair Turn Black:కేవలం రెండు రూపాయలతో… తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా… చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తున్నారు.
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకోవాలి.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న ప్యాకెట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారు రెండు ప్యాకెట్లు వేసుకోవాలి. దీనిలో నాలుగు లేదా ఐదు చుక్కల రోజువారి కొబ్బరి నూనె, అర స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.
ఈ మూడింటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత జుట్టు గట్టిగా ముడి పెట్టుకోవాలి. ఒక గంట పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో ఎటువంటి షాంపూ లేకుండా శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు రోజులు చేయడం వలన తెల్ల వెంట్రుకలు పోయి జుట్టు నల్లగా అవుతుంది.
ఈ చిట్కాను ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోండి.