Tollywood Heroes:40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు !
Tollywood Heroes:40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు.. పెళ్లి అనేది జీవితంలో ఒక బాగం కావాలి. అయితే ప్రస్తుత కాలంలో సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కొంత మంది వయస్సు పెరుగుతున్నా పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా లేరు. పెళ్లి మాటను దాటవేస్తూ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ఆ హీరోలు ఎవరో చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 43 సంవత్సరాలు దాటిన పెళ్లి మాట ఎత్తటం లేదు. సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.
45 సంవత్సరాలు విశాల్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నాడు. మొదట ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉండి వివాహం చేసుకుంటామని ప్రకటించినా…ఆ తర్వాత విబేదాలు వచ్చాయి. ఆ తర్వాత 2019లో వైజాగ్ అమ్మాయి అనిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి వరకు వెళ్ళలేదు.
45 సంవత్సరాలు ఉన్న సుబ్బరాజ్ కూడా పెళ్ళికి దూరంగానే ఉన్నాడు. పెద్దల బలవంతంతో కాకుండా నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని సుబ్బరాజు అంటూ ఉంటాడు.
సుమంత్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నా…ఇద్దరికీ సెట్ అవ్వక విడాకులు తీసుకున్నారు. 48 సంవత్సరాలు వచ్చినా ఇంకా సుమంత్ పెళ్లి జోలికి వెళ్ళటం లేదు.
నాలుగు పదులు దాటినా పెళ్ళి ఊసు ఎత్తడం లేదు హీరో తరుణ్. ఒక్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోయిన ఈ హీరో.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.