MoviesTollywood news in telugu

Prema Kavali:ప్రేమ కావాలి హీరోయిన్‌ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..

Prema Kavali Movie:సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు అత్యంత ప్రేక్షక ఆదరణ పొందాయి.

అలాగే ఈ సినిమాలో ఇషా చావ్లా కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇప్పటి వరకు ఆరు చిత్రాలు చేసినా, అందులో ఐదు తెలుగు సినిమాలు మరియు ఒక కన్నడ సినిమా మాత్రమే. 2014లో తెలుగు సినిమాలో నటించిన తర్వాత మరల సినిమాల్లో కనిపించలేదు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న’విశ్వంభర’ అనే చిత్రంతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతుంది.. ప్రేమ కావాలి సినిమా తర్వాత, సునీల్ హీరోగా పూలరంగడు సినిమాలో అనిత పాత్రను నటించిన ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో కూడా మెరిసింది.

మిస్టర్ పెళ్లికొడుకు చిత్రంలో నటించినా.. ఆ సినిమా ఆశించిన పలితాన్ని ఇవ్వలేదు. సత్తిబాబు దర్శకత్వంలో జంప్ జిలానీ చిత్రంలో అల్లరి నరేష్‌తో నటించినా, అది కూడా విజయం సాధించలేదు. 2016లో దర్శన్ నటించిన విరాట్ అనే కన్నడ చిత్రంలో కనిపించి, నటనకు కొంత విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు విశ్వంభర సినిమాతో టాలీవుడ్‌లో మళ్లీ ప్రేక్షకులను అలరించటానికి సిద్దం అవుతుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."