Polala Amavasya 2024:పోలాల అమావాస్య రోజు మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటిస్తే..గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి
Polala Amavasya 2024 పోలాల అమావాస్య రోజు మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటిస్తే..గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.. శని దేవుడు మకరం, కుంభ రాశులకు అధిపతి. పోలాల అమావాస్య రోజున ఈ రాశుల వారు 21 దీపాలను వెలిగించి రోటీలను దానం చేయాలి.ఈ విధంగా చేయడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోయి, ఇంటిలో సంతోషం, శ్రేయస్సు, మరియు ఐశ్వర్యం పెరుగుతాయి.
మేషం, వృశ్చికం ఈ రెండు రాశుల అధిపతి అంగారకుడు. పోలాల అమావాస్య రోజున, ఈ రాశుల వారు ఉదయం ఇంటి నుండి బయలు దేరేటప్పుడు దక్షిణ దిశగా బెల్లం ముక్కను వదిలి, సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించి, రెండు ఎండు మిరపకాయలను వేయాలని చెప్తారు. ఈ విధంగా చేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి, ఆదాయం పెరుగుతుందని నమ్మకం.
వృషభం, తులారాశి రెండు రాశులకు శుక్రుడు అధిపతి. ఆయనను భౌతిక సుఖాలు మరియు అందం యొక్క ప్రతీకగా చూస్తారు. శ్రావణ అమావాస్య సమయంలో, ఈ రాశుల వారు తెల్లని ఆవుని పచ్చి గడ్డితో పోషించి, పసుపు గంధం రావి ఆకులపై రాసి, నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలితే, పూర్వీకులు సంతోషించి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని నమ్మకం.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. శ్రావణ అమావాస్య నాడు, కర్కాటక రాశి వారు సాయంకాలం రావి చెట్టు కింద ఐదు దీపాలను వెలిగించి, నూనె పోసి ప్రార్థన చేయాలి. ఈ విధంగా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదాలు లభించటమే కాకుండా లక్ష్మీ దేవి కృపను కూడా పొందుతారు.
మిధునం, కన్య రాశుల వారికి బుధుడు అధిపతి. పోలాల అమావాస్యన ఈ రాశుల వారు పచ్చి మిర్చిని దానం చేయాలి.. అలాగే తెల్లని ఆవులకు పచ్చి గడ్డి పెట్టాలి. ఈ రోజు పవిత్ర నదిలో స్నానం చేసి, సూర్యుడికి నీరాజనం చేసి, ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. దీనివల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోయి.. ఆనందం మరియు సంపద పెరిగి ఇబ్బందులు ఏమి ఉండవు.
ధనస్సు, మీన రాశులకు అధిపతి గురువు. పోలాల అమావాస్య రోజు 11 గులార్ ఆకులను తీగతో కట్టి మర్రి చెట్టుకు కట్టాలి. అంతేకాకుండా ఈశాన్య దిశలో కూర్చొని విష్ణు సహస్రనామం చదవాలి. ఈ విధంగా చేయటం వలన సకల పాపాలు, దోషాల నుండి విముక్తి కలుగుతుంది. ,అలాగే పెండింగ్ పనుల్లో కూడా మంచి పురోగతి ఉంటుంది.
సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహ రాశి వారు శ్రావణ అమావాస్య నాడు రాగి పాత్రలో నీరు నింపి, ఆ నీరు ఇంటి తూర్పు దిశలో చల్లితే, నెగెటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ