MoviesTollywood news in telugu

Manasantha Nuvve:‘మనసంతా నువ్వే’లో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

Manasantha Nuvve Uday Kiran Sister:తన కెరీర్ ఆరంభంలో లవ్ మరియు రొమాంటిక్ చిత్రాలలో నటించి ‘లవర్ బాయ్’ ఇమేజ్‌ను సంపాదించిన దివంగత నటుడు ఉదయ్ కిరణ్, ‘నువ్వు నేను’ చిత్రం తర్వాత ‘మనసంతా నువ్వే’ అనే మరో లవ్ డ్రామాలో నటించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరం అత్యధిక విజయాలను సాధించిన సినిమాలలో ఒకటి.

ఈ సినిమా హిందీ, తమిళ్, కన్నడ, బెంగాలీ భాషలలో రీమేక్ అవ్వటం ఒక విశేషం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోయిన్ రీమాసేన్ ఉదయ్ కిరణ్‌తో జోడి కట్టింది. ఈ సినిమాలో పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయి. సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా తర్వాత ఒక ప్రత్యేక అభిమాన గణం సంపాదించారు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి పేరును సంపాదించారు, ప్రత్యేకించి ఉదయ్ కిరణ్ చెల్లెలి పాత్ర చేసిన నటికి మంచి గుర్తింపు వచ్చింది. ఉదయ్ చెల్లెలుగా, చంద్రమోహన్ కూతురుగా నటించిన శిరీష గుర్తుందా? ఆమె ఆ తర్వాత చాలా సినిమాల్లో చెల్లెలి పాత్రలలో మెరిసింది.

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ వంటి హీరోలకు చెల్లెలుగా నటించి మంచి పేరు సంపాదించింది. అందమైన రూపం, ఆకట్టుకునే నటన ఉన్నా, హీరోయిన్‌గా కాకుండా తెలుగు ప్రేక్షకులకు హీరోల చెల్లెలిగా గుర్తింపుపొండి మంచి సక్సెస్ సాదించింది.

సినిమాలకు సురం అయినా ఇమే చాలా కాలానికి ఓ షోలో మెరిసింది. పెళ్లి చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేస్తూ.. సుమారు 8 నుండి 9 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయింది. బుల్లితెరలో సీరియల్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. బుల్లితెరపై ‘ఊర్వశివో, రాక్షసివో’ సీరియల్‌లో కీలకమైన పాత్రను పోషిస్తుంది, అందులో ఆమె హీరోకు తల్లిగా నటిస్తుంది.

‘సీతా రాముడి కట్నం’ సీరియల్‌లో కూడా నటిస్తుంది.నటనతో పాటు, ఆమె యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా చాలా బిజీగా గడుపుతుంది. సినిమాల్లో కూడా మంచి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ