MoviesTollywood news in telugu

Saripodhaa Sanivaaram: నాని ‘స‌రిపోదా శ‌నివారం’ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌! స్ట్రీమింగ్ అప్పుడేనా?

Saripodhaa Sanivaaram:నాని అనగానే అందరికీ క్యూట్‌, ఫ్యామిలీ, మరియు రొమాంటిక్‌ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ, అప్పుడప్పుడు నాని రోటిన్‌ బిన్నంగా యాక్షన్‌ సినిమాలను చేస్తూ అభిమానులను అలరిస్తాడు.’దసరా’ అనే యాక్షన్‌ మూవీతో గతంలో బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన నాని.. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌తో ఈ రోజు ఆగస్టు 29, గురువారం నాడు అభిమానుల మునుడ్కు వచ్చాడు.

ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన ‘అంటే సుందరానికి’ అనే గత సినిమా కూడా ఒక డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ రోజు థియేటర్‌లో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికపై త్వరలో స్ట్రీమింగ్‌ అవుతుందని.. టైటిల్‌ కార్డ్స్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందో త్వరలో అధికారిక ప్రకటన చేస్తారు. సాధారణంగా ఒక కొత్త సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది, కానీ ఈ సినిమా పలితాన్ని బట్టి ఈ సమయం మారుతుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ