Beauty Tips

Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు…

Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు… ప్రతి సీజన్ మార్పు అనేది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ ఆరోగ్యం మాత్రమే కాదు, చర్మం మరియు జుట్టు కూడా సమస్యలకు గురి అవుతాయి.చర్మం పొడిగా మారడం, దద్దుర్లు, ఫంగస్ in ఫెక్షన్స్ వంటివి అధిక తేమ వలన వస్తాయి. వర్షాకాలంలో జుట్టు రాలడం నివారించడానికి కొన్ని ఆహారాలు చాలా ఉపయోగపడతాయి.

సీడ్స్, నట్స్..
గింజలు మరియు నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అలాగే జింక్, విటమిన్ E కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తాయి.

గ్రీక్ యోగర్ట్..
గ్రీక్ పెరుగు ప్రోటీన్‌లతో సమృద్ధిగా ఉండి జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని మితంగా వాడటం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

క్యారెట్లు..
క్యారెట్లలో బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

చిలకడదుంపలు..
చిలకడదుంపలలో బీటా-కెరోటిన్ ఉండటం వలన ఇది జుట్టు కుదుళ్లను బలపరచి జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు అధిక మొత్తంలో సిలికాను కలిగి ఉంటాయి. ఇది జుట్టును బలపరచడంలో సహాయపడుతుంది. జుట్టు రాలిపోవడం సమస్యను ఎదుర్కొనే వారు స్ట్రాబెర్రీలను తినడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకొని జుట్టును ఆరోగ్యంగా పెంచుకోవచ్చు.

ఓట్స్..
ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఐరన్, మరియు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి, ఇవి జుట్టుకు మంచిది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీ-అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు కూడా వీటిలో సమృద్ధిగా ఉంటాయి.

పప్పులు..
కాయధాన్యాలలో ఉండే ప్రోటీన్లు, జింక్, ఐరన్, మరియు బయోటిన్ వంటివి జుట్టు ఆరోగ్యం మెరుగుదలలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇవి విటమిన్-బి మరియు విటమిన్-సితో కూడా సమృద్ధిగా ఉండి జుట్టును పోషించడంలో సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."