Curry Leaf Tea : రోజూ 1 కప్పు కరివేపాకు టీ తాగండి.. ఊహించని ప్రయోజనాలు
Curry Leaves Tea:కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అందుకే మన పూర్వీకులు దీనిని వంటలో ఉపయోగించారు. నేడు కూడా, కరివేపాకు లేని వంటకాలు అపూర్ణంగా అనిపిస్తాయి.
కరివేపాకులో ఉండే విటమిన్లు మరియు పోషకాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. కరివేపాకు టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది..
కరివేపాకు టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ మరియు గ్రీన్ టీలతో పాటు డైటీషియన్లు కరివేపాకు టీని కూడా తాగమని సూచిస్తున్నారు. ఇది ఎంతో ప్రయోజనకరం అని వారు చెప్తున్నారు.
వారంలో ఒకసారి లేదా రెండుసార్లు తాగితే దానిలోని పోషకాలు ఆహారం జీర్ణం చేయడంలో మరియు జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని వారు చెప్తున్నారు. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం ఇవ్వడంతో పాటు, జీర్ణవ్యవస్థకు వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది.
అదుపులో డయాబెటిస్..
కరివేపాకు టీని తరచుగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు తొలగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పలు రకాల ప్రమాదకర వ్యాధులకు నిరోధకంగా పనిచేస్తుంది.
వైద్యులు చెప్పినట్లు, దీన్ని ప్రతి రోజు తాగితే అనారోగ్య సమస్యలు రావు. కరివేపాకు టీ అధిక బరువు సమస్యకు చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడే వారు దీన్ని తరచుగా తాగడం ఉత్తమం.
చర్మ సమస్యలకు చెక్..
కరివేపాకు టీ వలన చర్మం సంబంధిత అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీనిని తాగడం ద్వారా చర్మం ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ పొందుతుంది. అలాగే ఇతర చర్మ వ్యాధుల నివారణలో కూడా సహాయపడుతుంది. ఒత్తిడి మరియు ఆందోళనల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆధునిక యుగంలో అందరూ ఒత్తిడి మరియు ఆందోళనలకు గురి అవుతున్నారు.
వీటిని దూరంగా ఉంచాలంటే కరివేపాకు టీని తరచుగా తాగాలని సలహా ఇస్తున్నారు. జుట్టు రాలడం మరియు రుతుస్రావ సమయంలో మహిళలు అనుభవించే తీవ్ర కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా ఇది పరిష్కారం. కావున ఉదయం పరిగడుపున కరివేపాకు టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ