Beauty Tips

Korean Glass skin : కొరియన్ స్కిన్‌లా మీ స్కిన్ మెరవాలా.. ఇలా చేయండి..

Korean Glass skin :ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన ఒత్తిడి మరియు ఆందోళన వలన యువత కూడా చాలా పెద్దవారిలా కనబడుతున్నారు. 30 ఏళ్ళ వయసులోనే చర్మంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒత్తిడి ఎక్కువైతే వృద్ధాప్యం తొందరగా రావచ్చు.

రోజుకు కేవలం అరగంట సమయం మీ చర్మ సంరక్షణకు కేటాయించినా, మీరు మంచి చర్మం పొందవచ్చు. నిరంతరం ఈ అలవాటును పాటిస్తే మంచి చర్మం మీదే. దీనికి అధిక ఖర్చు అవసరం లేదు.

తేనె – పెరుగు ప్యాక్:
చర్మం అందాన్ని పెంచడానికి తేనె మరియు పెరుగు రెండూ చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న బౌల్‌లో సమాన పరిమాణాల్లో తేనె మరియు పెరుగును తీసుకొని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. దాదాపు అరగంట వరకు ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీ చర్మం మంచి కాంతిని పొందుతుంది.

పసుపు – చందనం:
పసుపు మరియు చందనం చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటిని సమాన పరిమాణాల్లో తీసుకొని.. పాలు, పెరుగు, రోజ్ వాటర్, లేదా నీళ్లు కలిపి ముఖంపై అప్లై చేయాలి. దీనిని మితంగా వాడితే ముఖం మరింత క్లియర్‌గా మరియు మెరిసేలా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."