Healthhealth tips in telugu

Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు

Finger millet:రాగులు గురించి ఈ కాలంలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీటిని ప్రజలు ఆహారంగా బాగా వాడుతున్నారు. ‘ఫింగర్ మిల్లెట్’ అని కూడా పిలుస్తారు వీటిని. ఇతర ధాన్యాల కంటే రాగులు ఎంతో పోషకాలు నిండి ఉంటాయి. వీటిలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మరియు మినరల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి, అలాగే కొవ్వు శాతం చాలా తక్కువ.

రాగులను ఉపయోగించి అనేక రకాల వంటకాలు చేయవచ్చు. ఉదాహరణకు రాగి సంగటి, అంబలి, లడ్డూలు, రొట్టెలు మొదలైనవి. రాగులు సహజంగా గ్లూటెన్ రహిత ఆహారంగా ఉంటాయి. వీటిని లిమిట్ గా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.

ఎముకలు ఆరోగ్యం
రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల, ఎముకలు బలపడతాయి. పిల్లలకు రాగులు ఇవ్వడం వల్ల వారి ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాయి. రాగులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

డయాబెటీస్
రాగులు తినడం వల్ల డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా ఉంచుతాయి. ఇది జీవ క్రియలను నిదానించి షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది
రాగులు తినడం వల్ల రక్త నాళాల్లో చెడు కొవ్వు తగ్గుతుంది. అలాగే శరీరంలో అదనపు కొవ్వు కూడా కరుగుతుంది. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావు.

రక్త హీనత
రాగులు ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడే వారు వీటిని తీసుకుంటే ఈ సమస్యను జయించవచ్చు.

వయస్సు తగ్గుతుంది:
మిల్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. రాగులను మితంగా తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా యవ్వనంగా ఉండవచ్చు. ఇది శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ