Guppedantha manasu serial:గుప్పెడంత మనసు సీరియల్ రిషి వదిన గురించి ఈ విషయాలు తెలుసా..?
Guppedantha manasu serial:గుప్పెడంత మనసు సీరియల్ రిషి వదిన గురించి ఈ విషయాలు తెలుసా..ప్రస్తుత ట్రెండ్‌లు మారినట్లుగానే, ఆడియన్స్ కూడా మారారు. గతంలో సీరియల్స్‌ను బోరింగ్‌గా భావించిన వారు, ఇప్పుడు ఒక రోజు కూడా మిస్ అయితే చాలా బాధపడుతున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్‌ను మరియు అందులో నటించే నటులను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారు.
దీనితో పాటు సీరియల్స్‌లో అలరించే నటీనటులకు అభిమానుల నుండి అపారమైన క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా వీరికి అనేక అభిమాన గ్రూపులు ఏర్పడి వీరిని ఆరాధిస్తున్నారు. అలాంటి నటులలో మనం ఇప్పుడు చర్చించబోయే సీరియల్ నటి ఒకరు. ఆమె ఎవరో కాదు, ప్రముఖ బుల్లితెర నటి సీతా మహలక్ష్మి.
ఈ పేరు కొంతకాలం పరిచయం లేనిదే అయినా, ‘గుప్పెడం మనసు’ సీరియల్‌లో రిషి వదిన ధరణి అనే పాత్ర మాత్రం వెంటనే గుర్తుకు రావచ్చు. ఆ సీరియల్ నటి ఆ పాత్రను అంతగా స్వంతం చేసుకుంది. పేరుకు తగినట్లుగా లక్షణాలు, అందం కలిగిన సీతా మహలక్ష్మి ఒక తెలుగు అమ్మాయిగా ఉండటం విశేషం. సీరియల్‌లో మొదట అమాయకంగా ఉండే సీతా మహలక్ష్మి పాత్ర తర్వాత భర్త అత్తకు పక్కలో బళ్లెంలా గుచ్చే పాత్రగా మారి చాలా ఆసక్తికరంగా మారింది.
సీతా మహలక్ష్మి ఈ సీరియల్‌కు ముందు అనేక సీరియల్స్‌లో నటించారు, వాటిలో ఈటీవీలో ప్రసారమైన గోరింటాకు, అభిషేకం, గీత గోవిందం వంటి ప్రముఖ సీరియల్స్ ఉన్నాయి. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా ఆమె నటనతో అలరించారు. అయితే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ వలన ఆమెకు వచ్చిన క్రేజ్ అపూర్వం. సోషల్ మీడియాలో కూడా ఆమెకు గొప్ప ఫాన్ బేస్ ఉంది.
తాజాగా, సీతా మహలక్ష్మి వివాహం చేసుకుని సత్యం రాజుతో వివాహ బంధంలో చేరారు. ఇటీవల ఆయనతో తీసిన రోమాంటిక్ వీడియోలు, ఫోటోలను షేర్ చేసారు.
నెటిజన్లు ఫోటోలను చూసి మీకు పెళ్లి అయిందా? అతనెవరు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అని ఆమె అభిమానులు అడిగారు. దానికి సీతా మహలక్ష్మి స్పందించి, అవును, అది సడెన్‌గా జరిగింది, కానీ పెళ్లికి ఎవరినీ పిలవలేదు అని స్పష్టత ఇచ్చింది.
గుప్పడంత మనసు సీరియల్ గురించి చెప్పాలంటే, ఇది యువత మరియు కుటుంబాల ఆదరణను పొందిన సీరియల్ అని చెప్పవచ్చు. రిషిధార సీరియల్ ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోయింది. అందులో నటించే నటులు తెలుగు ప్రేక్షకులతో బాగా అనుసంధానం అయ్యారు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ