MoviesTollywood news in telugu

Indra movie:ఇంద్ర మూవీ చైల్ట్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏ రంగంలో స్థిరపడ్డారో తెలుసా..?

Indra movie:మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ చిత్రం పేరు వింటే, ‘దాయి దాయి దామ్మా’ అనే వీణ స్టెప్ గుర్తుకు రావడం సహజం. ఈ సినిమాలో సీరియస్ కథాంశంతో పాటు, కామెడీ అంశం కూడా ప్రధానంగా ఉంది. కాశీలో టూరిస్టులను మోసం చేసే పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ నటన ప్రేక్షకులను నవ్వులతో అలరించింది.

తెనాలి నుంచి వచ్చిన బచ్చు పెద్ద పిచ్చయ్య కుటుంబం (ఏవీఎస్ కుటుంబం) గురించి ఇది. తెనాలి అనగానే ‘మీది తెనాలే, మాది తెనాలే.. మనది తెనాలే’ అంటూ ఈ ముగ్గురు వారిని మోసం చేస్తారు. పెద్ద పిచ్చయ్యగా ఏవీఎస్ అద్భుతంగా నటించాడు.అలాగే చిన్న పిచ్చయ్యగా ఓ బుడ్డోడు ఆకట్టుకున్నాడు. ఆ పిల్లోడు ఎవరో ఇప్పుడు ఎలా మారిపోయాడో ఏం చేస్తున్నాడో మీకు తెలుసా?

ఇంద్ర చిత్రంలో బాల నటుడిగా నవ్వులు పంచిన ఆ పిల్లవాడి పేరు శివ దుర్గా ప్రసాద్ అలియాస్ బంటి. ఈయన సుమారు 80 సినిమాలలో నటించారు. హైదరాబాద్‌లో పెరిగారు. ఇంద్ర సినిమాలో మాత్రమే కాకుండా ఫ్యామిలీ సర్కస్ చిత్రంలో కూడా జగపతి బాబుని తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. జగపతి బాబు కారు టైర్ పంక్చర్ చేసి పరుగు తీయించినది కూడా ఈ బాల నటుడే. ‘దీంతో నా టైర్ పోయింది, ఎక్కడైనా దొరికిందా?’ అని అడిగే సీన్‌లో హీరో పరిస్థితి చాలా వినోదభరితం.

ఈ సీన్‌ను చాలా మంది గుర్తుంచుకుంటారు. పద్మనాభంలో బడ్జెట్‌లో జగపతి బాబు చిన్నప్పటి పాత్రను చేశారు. అలాగే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ చిత్రంలో బ్రహ్మానందం కొడుకుగా ఈ బాల నటుడు నటించాడు. ఎవడిగోల వాడిదే, వాడంతే అదో టైప్, దేవ, సుల్తాన్, ఔనన్న కాదన్నా, గంగోత్రి వంటి విచిత్రమైన చిత్రాల్లో నటించాడు. మరియు బుల్లితెరపై కూడా పలు మంచి సీరియల్స్‌లో నటించాడు.

దర్శక ధీరుడు రాజమౌళి చేసిన సీరియల్ ‘శాంతి నివాసం’ మరియు ప్రముఖ కామెడీ సీరియల్ ‘అమృతం’లో గుండు హనుమంతరావు గారి కొడుకుగా నటించాడు దుర్గా ప్రసాద్. చిరంజీవిపై అభిమానంతో అతని తల్లి కొడుకును నటుడిగా మార్చాలని కోరుకుంది. బాలనటుడిగా అతను చాలా అద్భుతంగా నటించాడు. కానీ చదువుల కోసం సినిమాలకు విరామం ఇచ్చి, అతను ఇంజనీరింగ్ మరియు ఎంబీఎ పూర్తి చేశాడు.

ఆయన ప్రస్తుతం సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే మరలా పరిశ్రమలోకి రావాలని ఆశిస్తూ ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేసారు. సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి దర్శకులను తాను చాలా ఇష్టపడతానని పేర్కొన్నారు. నెగటివ్ షేడ్స్ గల పాత్రలను పోషించాలన్న తన కోరికను కూడా చెప్పుకొచ్చాడు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ