Tollywood Heroine:ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. టాలీవుడ్ యంగ్ హీరో భార్య..
Tollywood Heroine:ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తించారా? ఆమె ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న అందాల తార. లక్షల జీతం ఇచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, సినిమా రంగంలోకి ప్రవేశించింది. షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి పేరు గాంచింది. అనేక సినిమాల్లో చిన్న పాత్రలతో నటించి, చివరకు హీరోయిన్‌గా తన మొదటి సినిమాతోనే హిట్‌ను సాధించింది.
తన మొదటి సినిమాలో నటించిన హీరోతో జీవితం పంచుకుంటూ, ఇటీవల మూడు ముళ్ల బంధంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు, కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్. కర్ణాటకలోని కూర్గ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రహస్య అసలు పేరు ఐశ్వర్య గోరఖ్. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఆమె ‘రాజా వారు రాణిగారు’ సినిమాలో మాత్రమే నటించిందని. కానీ, 2012 నుంచి ఆమె అనేక సినిమాల్లో నటించిన విషయం చాలా మందికి తెలియదు. 2012లో మంచు విష్ణు, హన్సికలతో ‘దేనికైనా రెడీ’ సినిమాలో రహస్య చిన్న పాత్ర పోషించింది. ఆమె మంచు విష్ణుకి కాలేజ్ క్లాస్‌మేట్‌గా నటించింది.
‘హ్యాపీ ఎండింగ్’, ‘ఆకాశమంత’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. 2017లో ‘రెండు రెళ్లు ఆరు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రహస్య, తర్వాత ‘తేజ్ ఐ లవ్ యూ’లో సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌తో నటించింది. కిరణ్ అబ్బవరంతో ‘రాజు వారు రాణి గారు’ చిత్రంలో నటించి క్రేజ్ సాధించింది. తమిళ చిత్రంలో కదిర్‌తో నటించిన తర్వాత, ఆమె సినిమాల్లో తక్కువగా కనిపించారు. ఇప్పుడు రహస్య తన మొదటి హీరో కిరణ్ అబ్బవరంతో వివాహం చేసుకుంది.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ