Almond Tea: రోజుకో కప్పు బాదం టీ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Almond Tea Benefits:ప్రతి రోజు ఉదయం చాలా మంది వేడి టీతో దినచర్య ప్రారంభిస్తారు. కొందరు ఉప్పు నీరు తాగి బాత్‌రూమ్‌కి వెళ్తారు, మరికొందరు నీటిలో నానబెట్టిన బాదంపప్పులను తింటారు. ఉదయం పూట బాదం టీ కూడా ఒక మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం, సాధారణ టీ కంటే బాదం టీ తాగడం ఉత్తమం.
బాదం టీ గురించి విని ఆశ్చర్యపోతున్నారా? ఇది సాధారణ టీ కంటే ఎంతో ఆరోగ్యకరం. ఈ టీలో విటమిన్ ఎ, ఇ, బి2, మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బాదం టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అలాగే ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉండి బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
బాదంపప్పులో విటమిన్ ఇ ఉండటం వల్ల, బాదం టీ తాగడం చర్మం ఎలిస్టిసిటీని పెంచుతుంది. అలాగే రిబోఫ్లావిన్, ఎల్-కార్నిటైన్ వంటి పదార్థాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బాదం టీ తయారీ విధానం ఇలా: ముందుగా, కొన్ని బాదం పప్పులను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత, బాదం పప్పులను మిక్సీలో వేసి బాదం పాలు తయారు చేయాలి. ఆ పాలను వేడి చేసి, దానిలో కొంచెం టీ డికాషన్, యాలకుల పొడి, తేనె, మరియు కుంకుమపువ్వు కలిపి, సన్నని సెగపై మరగబెట్టాలి. ఈ బాదం టీని ఉదయం తాగితే, మీ రోజు శుభారంభం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ