Diabetes: డయాబెటిస్‌ను కేవలం వారం రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..
Diabetes For Dates Seeds:ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పొడి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఖర్జూర గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఖర్జూరాలు చక్కెర ఎక్కువగా ఉండటంతో, డయాబెటిస్ ఉన్న వారు వాటిని తినకూడదు. కానీ ఖర్జూర గింజలు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ గింజలు రక్తంలో గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. ఖర్జూరంలో ఫైబర్ కూడా ఉండటంతో, జీర్ణ రుగ్మతల చికిత్సలో సహాయపడుతుంది. ఖర్జూర గింజలు మంచి జీవక్రియను నిర్వహించడంలో, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.
ఖర్జూర గింజలను ఎలా తినాలో తెలుసుకుందాం:
1. ఖర్జూరం తిన్న తర్వాత గింజలను శుభ్రంగా కడగాలి.
2. శుభ్రంగా కడిగిన ఈ గింజలను కొన్ని రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి.
3. ఎండిన గింజలను పాన్‌లో కాసేపు వేపాలి.
4. చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
5. ప్రతిరోజూ 1/2 టీస్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి,ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా చేస్తే వారం రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ