Beauty Tips

Hair Growth Tips: విపరీతంగా జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి

Hair Growth Tips: విపరీతంగా జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి.. ఆడవారి అందాన్ని పెంచడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది జుట్టు పట్టుకుచ్చులా అందంగా, పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది.

దీంతో చాలా మంది జుట్టు పెంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే జుట్టు ఊడటం తగ్గుతుంది. పైగా వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యల నుండి బయట పడటానికి మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్ధవంతంగా తగ్గించు కోవచ్చు. ఒక మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగిన 5 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకును శుభ్రంగా కడిగి వేయాలి.

ఆ తర్వాత చిన్న బీట్ రూట్ లో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక గుడ్డు తెల్లసొన, 3 స్పూన్ల ఆలోవెరా జెల్, 3 స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.

రెండు గంటలు అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు,జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య తగ్గటమే కాకుండా పొడిగా మారిన జుట్టు తేమగా మారుతుంది. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ