Hair Fall: ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గట్లేదా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
Hair Fall: ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గట్లేదా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో కాలుష్యం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం,ఒత్తిడి, రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి.
చుండ్రు అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత తొందరగా వదలదు. చుండ్రు సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకుంటే మంచిది. చుండ్రు సమస్య ఎక్కువ అయితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద., చికాకు ఉంటుంది. చుండ్రు కారణంగా జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది.
అలాగే తలలో చుండ్రు ఉండటం వలన చర్మంపై మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. మనలో చాలా మంది చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలను, నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటిలో తయారు చేసుకున్న నూనెను వాడితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. .
ఈ నూనె తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ జార్ లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్ల గ్రీన్ టీ పౌడర్, ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ గ్లాస్ జార్ కి మూత పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో 10 నిమిషాల పాటు వేడి చేయాలి. ఆ తరువాత పల్చని వస్త్రం సాయంతో ఆయిల్ ని వడగట్టాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపి స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. .
మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. .తెల్లజుట్టు సమస్య కూడా తొందరగా రాదు. జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. కాబట్టి ఈ నూనెను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ