Kitchenvantalu

Sweat Smell from Clothes:బట్టల నుంచి చెమట వాసన రాకుండా ఉండాలంటే..

Sweat Smell from Clothes:బట్టల నుంచి చెమట వాసన రాకుండా ఉండాలంటే.. బట్టలను ఎంత శుభ్రంగా ఉతికిన సరే చెమట వాసన వస్తూ ఉంటుంది. బట్టలను వేసుకున్న ప్రతి సారి అదో రకమైన వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

బట్టలను ఎండలో ఆరబెట్టాలి. బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మడత పెట్టాలి. లేదంటే వాసన వస్తుంది.

బట్టల్ని ఉతికిన తర్వాత నీటిలో నిమ్మరసం వేసి కాసేపు అందులో బట్టల్ని నాననివ్వండి.ఆ తర్వాత తీసి నీటిని పిండి తర్వాత వాటిని ఆరేయండి. దీంతో బట్టల నుంచి వాసన అంతగా రావు. బ్యాక్టీరియాని చంపడానికి మీ బాడీ నుండి వచ్చే ఆయిల్స్‌ని కంట్రోల్ చెయటానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

బట్టలు ఉతకడానికి ముందు 30 నిమిషాల పాటు నీటిలో వైట్ వెనిగర్ వేసి అందులో బట్టలు నానబెట్టండి. వెనిగర్ అనేది ఓ సహజ డియోడరైజర్ గా పనిచేసి బ్యాక్టీరియాని చంపుతుంది.దాంతో చెమట వాసన దూరం అవుతుంది.

బేకింగ్ సోడా చెమట వాసనని బ్యాలెన్స్ చేస్తుంది. బట్టలు ఉతికే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. అదే విధంగా, బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు వేసి పేస్టులా చేయండి. ఎక్కడి నుంచి ఎక్కువగా వాసన వస్తుందో అక్కడ ఈ పేస్టు రాసి రుద్దండి. దీని వల్ల ఎక్కువగా వాసన రాదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."