Kitchenvantalu

Refrigerator Cleaning Tips: రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే ఫ్రిజ్‌ మెరిసిపోతుంది!

Refrigerator Cleaning Tips: రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే ఫ్రిజ్‌ మెరిసిపోతుంది.. ఇల్లు అందంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వస్తువులు శుభ్రం చేయకపోతే ఇల్లు చూడటానికి బాగోదు. అలాంటి వాటిలో రిఫ్రిజిరేటర్ ఒకటి.

వంట గదిలో ఉంచిన రిఫ్రిజిరేటర్ ని ప్రతిరోజు దాదాపుగా శుభ్రం చేసుకోవాల్సిందే. రిఫ్రిజిరేటర్ జిడ్డుగా మారితే ఇప్పుడు చెప్పిన చిట్కాలు మీకు చాలా బాగా సహాయపడతాయి. ఫ్రిజ్లో మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలను పెడుతూ ఉంటాం. ఫ్రిజ్ మురికి పడితే ఆహారం పాడవుతుంది.

ఫ్రిజ్లో ఉన్న డ్రాయర్లను శుభ్రం చేయటానికి ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలిపి పేస్టులా చేసి ఆ పేస్ట్ ని స్పాంజీ సాయంతో ఆ డ్రాయర్స్ ని శుభ్రం చేయాలి.

మొండి మరకలు ఉంటే గనుక బేకింగ్ సోడా వెనిగర్ కలిపి పేస్ట్ గా చేసి మరకలు ఉన్న ప్రదేశంలో రాసి స్పాంజీతో స్క్రబ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన క్రిములు కూడా తొలగిపోతాయి. ఈ పేస్ట్ సాయంతో ఫ్రిజ్ తలుపు ఇతర భాగాలను కూడా శుభ్రం చేయొచ్చు. ఫ్రిజ్ దుర్వాసన వస్తూ ఉంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్లో ఉంచితే ఆ వాసన తొలగిపోతుంది.

15 రోజులకు ఒకసారి రీజనింగ్ తప్పనిసరిగా శుభ్రం చేయాలి. అప్పుడే ఫ్రిడ్జ్ మురికిగా లేకుండా మిలమిలా మెరవటమే కాకుండా ఫ్రిజ్లో పెట్టిన ఆహారాలు కూడా బాగుంటాయి. అలాగే చెడిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో అసలు పెట్టకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."