Face Glow Tips: ఫంక్షన్ కి వెళ్లే 15 నిమిషాల ముందు ఇలాచేస్తే ముఖం తెల్లగా మెరుస్తుంది
Face Glow Tips: ఫంక్షన్ కి వెళ్లే 15 నిమిషాల ముందు ఇలాచేస్తే ముఖం తెల్లగా మెరుస్తుంది… ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి మరియు వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద జిడ్డు,మురికి పేరుకుపోయి ముఖం నల్లగా కనపడుతుంది. ఇలాంటప్పుడు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఈ చిట్కా ఫాలో అయితే మంచి పలితం ఉంటుంది.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల శనగపిండిలో అరస్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ మిల్క్ క్రీమ్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల రోజ్ water వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News