Healthhealth tips in telugu

Blood Sugar: షుగర్‌ బాధితులకు మ్యాజికల్ డ్రింక్.. ఇది ప్రతి రోజు ఉదయం ఈ నీటి తాగండి చాలు..

Blood Sugar: షుగర్‌ బాధితులకు మ్యాజికల్ డ్రింక్.. ఇది ప్రతి రోజు ఉదయం ఈ నీటి తాగండి చాలు.. డయాబెటిక్ పేషెంట్ తన ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బ్లడ్ షుగర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చాలా మంది వివిధ రకాల ఆహారాలను తీసుకుంటారు. అయితే చాలా మంది దీని కోసం ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. ఈ రోజు మనం మీకు బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసే మ్యాజికల్ డ్రింక్ గురించి చెప్పబోతున్నాం..

నల్ల శనగలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలా మంది శనగలను నంబెట్టిన నీటిని పారబోస్తూ ఉంటాం. ఈ నీటిని మన ఆరోగ్యానికి అమృతంగా నిపుణులు చెప్పుతూ ఉంటారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
chickpeas in telugu
ఈ నీటిని తాగటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే అలసట,నీరసం,నిసత్తువ లేకుండా రోజంతా చురుకుగా ఉంటారు. డయబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
gas troble home remedies
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. దీనితో పాటు గ్యాస్, అజీర్ణం, మంట, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఈ నీటిలో ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్‌లు ఉంటాయి. కాబట్టి శరీరంలోని అనేక సమస్యలను తొలగిస్తాయని నిపుణులు చెప్పుతున్నారు.
Diabetes diet in telugu
నల్ల శనగల నీటిని అలాగే తాగవచ్చు. లేదా ఈ నీటిలో ఉప్పు, నిమ్మరసం లేదా తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. అలాగే గోరువెచ్చగా చేసి కూడా తాగవచ్చు. ఇలా తాగటం కుదరని వారు ఈ నీటిని చపాతీ పిండి కలిపినప్పుడు ఉపయోగించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.